మెహబూబ్ దిల్ సే, లాస్య, దివి, కుమార్ సాయి.. వీళ్ళతో పోల్చితే, ప్రస్తుతం హౌస్‌లో వున్న కంటెస్టెంట్స్ ఎవరూ అంత స్ట్రాంగ్‌గా కనిపించడంలేదన్నది మెజార్టీ బిగ్‌బాస్ వీక్షకుల అభిప్రాయం. అందులోనూ నిజం లేకపోలేదు. నిజానికి, ఇప్పుడున్న చాలామంది కంటెస్టెంట్స్‌తో పోల్చితే, దేవి నాగవల్లి చాలా చాలా బెటర్. కానీ, ఎందుకో వాళ్ళందర్నీ ముందే బయటకు పంపేశారు. అలా వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి కారణం బిగ్‌బాస్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న బిగ్‌బాస్ వీక్షకులేనా.? కాదా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
తాజాగా, బిగ్‌బాస్ టెలికాస్ట్ సమయం కూడా మారింది. దాంతో, వీక్షకుల సంఖ్య బాగా పడిపోయిందన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. అఖిల్, నేరుగా ఫినాలెకి వెళ్ళిపోవడంతో హౌస్ మరింత డ్రమెటిక్‌గా మారిపోయింది. ఏదో పిల్లలాట అన్నట్టుంది తప్ప, ఓ సీరియల్ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇవ్వలేకపోతోంది బిగ్‌బాస్ రియాల్టీ షో. 'వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో' అంటూ నాగార్జున ఎంత ఎలివేషన్ ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
'ఆఖరి రెండు వారాలు, కాస్త కష్టపడి ఆడండి.. జాగ్రత్తగా ఆడండి..' అంటూ కింగ్ నాగ్ ప్రాధేయ పడుతున్నా హౌస్‌మేట్స్ వినడంలేదు. నిన్నటి టాస్క్ అయితే, మరీ బోరింగ్‌గా తయారైంది. ఎటూ అందరూ నామినేట్ అవుతారని తెలుసు. అదే జరిగింది. ఇంత డ్రామానా.? ఇంత గందరగోళమా.? అని వీక్షకులు వాపోతున్నా, బిగ్‌బాస్ టీమ్ తమ ఆలోచనలకు పదును పెట్టలేకపోతుండడం శోచనీయమే.