పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమాకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఏదో పండుగలా జరుపుకుంటారు సినీ అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సెంటర్ తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన ప్రతీ థియేటర్ కలకల లాడుతుంది. హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోతుంది. నిజానికి నిన్న కూడా సరిగ్గా ఇలానే జరిగుండాల్సింది. పవర్ స్టార్ కంబ్యాక్ చిత్రం 'వకీల్ సాబ్' మే 15న విడుదల అవ్వాల్సింది.
కానీ, కరోనా మహమ్మారి వల్ల ఈ చిత్ర విడుదల తేదీ వాయిదా పడింది. ఒక వేళ అన్ని బాగుండి ఆ మహమ్మారి, ఈ లాక్ డౌన్ లేకుండా ఉంటే.. ఈ పాటికి ఫ్యాన్స్ షో సంబరాలు, రివ్యూ లు, మొదటి రోజు లెక్కలు, బాక్స్ ఆఫీస్ రికార్డులు అంటూ 'వకీల్ సాబ్' మోత మోగిపోయేది. ముఖ్యంగా మొదటి రోజు రికార్డులు మాత్రం కచ్చితంగా బద్దలుకొట్టేది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ మునుపటి చిత్రం 'అజ్ఞాతవాసి' మొదటి రోజు వసూళ్లు 60 కోట్లు... దాన్నే ఇంత వరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది.
అలాంటిది కంబ్యాక్ చిత్రం 'వకీల్ సాబ్' రిలీజ్ అయ్యుంటే దాని మొదటి రోజు లెక్క ఏ రేంజ్ లో ఉండేదో?. టాక్ బాగుంటే మరో 'గబ్బర్ సింగ్' లా అల్ టైం ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం. ఈ మహమ్మారి బెడద ఎప్పుడు పోతుందో.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో.. వకీల్ సాబ్ ఎప్పుడొస్తాడో చూద్దాం మరి.