శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రోబో-2'. గతంలో సెన్సేషనల్ విజయం సాధించిన 'రోబో' చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'రోబో'కు మించిన భారీ బడ్జెట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది. అయితే గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. అవి స్టార్ట్ చేసి కూడా చాలా కాలమే అయ్యింది. కానీ భారీ గ్రాఫిక్స్ కాబట్టి, ఇంకా టైం తీసుకుంటోందట. అసలు ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది దీపావళికి విడుదలవుతుందనుకున్న 'రోబో-2', వచ్చే ఏడాది జనవరి 26కు పోస్ట్‌పోన్ అయ్యింది.
అయితే ఆ డేట్ కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లిందనీ తాజా గాసిప్స్ వినిపిస్తున్నాయి. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కు పోస్ట్‌పోన్ అయ్యిందనీ తాజా సమాచారమ్. ఇంత వెనక్కి వెళ్లడానికి కారణం విజువల్ ఎఫెక్ట్సేనట. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎఫర్ట్ ఎక్కువ కావడం వల్లనే సినిమా విడుదల ఇంకా ఆలస్యం అవుతూ వస్తోందనీ తెలియ వస్తోంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇటీవల దుబాయ్‌లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కనీ వినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్ నగరం అంతా ఈ ఆడియో ఫంక్షన్ కోసం ఎంత హడావిడి చేసిందో అందరికీ తెలిసిన సంగతే. అలాగే సినిమా విడుదల కోసం కూడా ప్రపంచం మొత్తం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా ఆలస్యం అభిమానుల్లో నిరాశ నింపుతోంది. ఎంత లేట్ అయితే సినిమా ఔట్‌పుట్ అంత బాగా వస్తుంది కదా.. అని సరిపెట్టుకోవాల్సిందే ప్రస్తుతానికి.