కొన్ని కాంబినేషన్లని వెండితెరపై చూడాలని అనుకుంటారు అభిమానులు. మహేష్ బాబుతో రాజమౌళి.. ఎప్పటి నుండి ఎదురుచూపులతో వున్న ఈ కాంబినేష్,.. ఎట్టకేలకు ఇటివలే ఫైనల్ అయ్యింది. ఇలాంటి కాంబినేషన్ మరొకటి వుంది. అదే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి. చాలా రోజుల నుండి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రకటన కూడా చేశారు. కానీ సినిమా ఎందుకో వెనక్కి వెళ్ళిపోయింది. వచ్చే ఛాన్స్ కూడా కనబడటం లేదు. మెగాస్టార్ ని డైరెక్ట్ చేయడం ప్రతి దర్శకుడి డ్రీం. అందులోనూ చిరుకి త్రివిక్రమ్ వీరాభిమాని. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి ఎక్కడో చిన్న ఇబ్బంది వుంది. నిజానికి చిరంజీవి సిద్దంగా వున్నారు. 'అల..' హిట్ తర్వాత ఇంక చేసేద్దామనే కబురు కూడా వెళ్ళింది.
కానీ త్రివిక్రమే కాస్త వెనకడుగు వేస్తున్నారని బోగట్టా. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, కుదిరితే మళ్ళీ అల్లు అర్జున్.. ఇలా వుంది త్రివిక్రమ్ ప్రిఫరెన్స్. అన్న..ట్టు చిరునే కాదు రామ్ చరణ్ తో కూడా త్రివిక్రమ్ తో ఓ సినిమా అనుకున్నారు. 'జగదీక వీరుడు'' టైపులో ఓ ఫాంటసీ కధ త్రివిక్రమ్ పెన్ లో వుంది. కానీ అది కూడా మెటిరియలైజ్ కావడం లేదు. మరి ఇందులో త్రివిక్రమ్ ఇబ్బంది ఏమిటో కానీ.. పవన్ కళ్యాణ్, బన్నీతో సింక్ అయినట్లుగా మెగా ఫాదర్ అండ్ సన్ తో త్రివిక్రమ్ కి కుదరడం లేదు. అయితే అభిమానులు మాత్రం ఈ కాంబినేష్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయో..