తెలుగులో వస్తున్న అతి పెద్ద రియాలిటీ షో.. బిగ్ బాస్. ఈ షో నిర్వహిస్తున్న తీరుపై ముందు నుంచీ పలు అనుమానాలూ, విమర్శలూ ఉన్నాయి. ఈ షో పూర్తిగా స్క్రిప్టు ప్రకారం నడుస్తుందని, బిగ్ బాస్ హౌస్‌లో తిట్టుకోవడం, ఏడ్వడం, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ స్క్రిప్టులో భాగాలే అని చెప్పుకుంటుంటారు. ఆఖరికి ఎలిమినేషన్ ప్రక్రియ లో కూడా గోల్ మాల్ జరుగుతుందని, ప్రేక్షకులు వేసే ఓట్లకూ ఎలిమినేషన్‌కీ అసలు సంబంధమే ఉండదన్న మరో విమర్శ మొదలైంది.
బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు ఉండాలి? ఎవరు బయటకు రావాలి? అనేది పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వాళ్ల ఓటింగే ఎలిమినేషన్ కి ప్రధానం. ఇది వరకు సీజన్‌లో కంటెస్టెంట్లలో కొంతమందికి బయట ఓ పీఆర్ టీమ్ ఉండేది. సోషల్ మీడియాలో.. ఆ టీమ్ జోరుగా పనిచయడం, ఓట్లు వేయించడం, తద్వారా తమ కంటెస్టెంట్లని సేఫ్ జోన్‌లో ఉంచడం ఇలా చేసేవారు. పెర్‌ఫార్మెన్స్‌ని బట్టే ఎలిమినేషన్ ఉండేది. అయితే ఈసారి ఇలాంటివేం జరగడం లేదని పిస్తోంది. ఎందుకంటే... `ఈ వారం వీళ్లు తప్పకుండా ఎలిమినేట్ అవుతారు` అనుకున్నవాళ్లంతా సేఫ్ అవ్వడం, సేఫ్ అవుతారని భావించిన వాళ్లంతా ఎలిమినేషన్‌కి గురి కావడం ఆశ్చర్యపరుస్తోంది.
పైగా... ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై ఆసక్తి బాగా తగ్గిపోయింది. పని గట్టుకుని ఓట్లేసేంత టాలెంట్.. ఏ ఒక్కరిలోనూ కనిపించకపోవడం తో లైట్ తీసుకుంటున్నారు. ఇదే అదనుగా బిగ్ బాస్ నిర్వాహకులు తమకు కావల్సిన వాళ్లని సేఫ్ చేస్తున్నారని, ఎంటర్‌టైన్ చేసేవాళ్లని సైతం పక్కన పెడుతున్నారని విమర్శలు మొదలయ్యాయి. మెనాల్ స్థానంలో అవినాష్ ఎలిమినేట్ అవ్వడం చూస్తుంటే... ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని పిస్తోంది.అవినాష్ ఎలిమినేషన్ తో ఈ షో పై జనాలకు పూర్తిగా ఇంట్రస్ట్ పోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.