'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' వచ్చేస్తోంది.!

By iQlikMovies - February 05, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

ఎప్పుడయితే 'రత్తాలు'గా చిరంజీవితో ఘాటు సెల్ఫీలు దిగిందో అప్పుడే లక్ష్మీరాయ్‌ స్టార్‌ మారిపోయింది. బాలీవుడ్‌లో 'జూలీ 2' ఏ కారణం చేత బెడిసికొట్టిందో తెలీదు కానీ, అప్పటి నుండీ లక్ష్మీరాయ్‌ వార్తల్లో హాట్‌టాపిక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాని హీటెక్కించే ముద్దుగుమ్మల్లో లక్ష్మీరాయ్‌ ముందు వరసకొచ్చేసింది. అంతేకాదు, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వివిధ చిత్రాలతో బిజీగా ఉంది. 

 

తాజాగా లక్ష్మీరాయ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' సినిమా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రేపు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది చిత్ర యూనిట్‌. కిషోర్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు. ఓ ఇంట్రెస్టింగ్‌ స్టోరీని కామెడీతో కనెక్ట్‌ చేసి వినూత్నంగా తెరకెక్కించారట ఈ సినిమాని. కమెడియన్లు మధునందన్‌, ప్రవీణ్‌ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో. ఇటీవల విడుదలైన ప్రోమో సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. 

 

ఇదిలా ఉంటే లక్ష్మీరాయ్‌ 'ఝాన్సీ' అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఈ సినిమాలో కనిపించనుంది మన రత్తాలు. మరోవైపు 'నియా 2' లో నాగిని పాత్రలో కనిపించనుంది. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లక్ష్మీరాయ్‌తో పాటు, వరలక్ష్మి శరత్‌కుమార్‌, కేథరీన్‌లు ఈ సినిమాలో ఇచ్ఛాధారి నాగినులుగా అలరించనున్నారు. ఇటీవల విడుదలైన 'నియా 2' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now