అజయ్ అంటే ఎవరో కాదు, 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి. తొలి సినిమా ఆ రేంజ్‌లో హిట్ అయినా, మనోడ్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇదిగో సినిమా అదిగో సినిమా.. ఈయనే హీరో, ఆయనే హీరో అన్నారు కానీ, ఎవరితోనూ సినిమా పట్టాలెక్కలేదు. 'మహాసముద్రం' అనే టైటిల్‌తో ఓ సినిమాని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నా.. అని ఆ మధ్య నామ్ కే వాస్తే ప్రకటనలు కొన్ని వచ్చాయి.
కానీ, అవీ రుజువు కాలేదు. ఈయన లిస్టులో జాయిన్ అయిన హీరోల్లో నాగ చైతన్య, రవితేజ తదితర హీరోలున్నారు. వీరిలో ఎవరైనా ఎస్ అని నో అన్నారా.? లేక మరేదైనా కారణమా.? ఇవేమీ కాక, ఇదో కొత్త రకం పబ్లిసిటీ స్టంటా.? అనేది తెలియలేకుంది. ఏదేమైతేనేం, తొలి సినిమాకే బోల్డ్ కంటెంట్‌తో వచ్చి తన డేరింగ్ ఇదీ అని చూపించిన అజయ్ భూపతి రెండో సినిమా కోసం ఒకింత కష్టపడుతున్నాడనే అనిపిస్తోంది. అయితే, కష్టం ఉండొచ్చు కానీ, ఈ రేంజ్‌లో ఇంకేదో చూపిస్తేనే తేడా కొట్టేయగలదు.
ఇంతకీ మనోడు ఏం చేశాడా? అనే కదా. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ కనీ కనిపించని ఫోటో పెట్టి 'చీప్ స్టార్' అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఎందుకిలా చేశాడు? ఆయన దృష్టిలో ఎవరా 'చీప్ స్టార్' అని ఫాలోవర్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకిలాంటి పజిల్ వదిలాడో అజయ్ భూపతి ఆయనకే తెలియాలి. ఈ లోగా నెటిజన్స్ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. నోటి కొచ్చిన కామెంట్లు చేతికొచ్చినట్లుగా పోస్ట్ చేసి పారేస్తున్నారు.