గోవా బ్యూటీ ఇలియానా ఇటీవలే తన ప్రియుడు ఆండ్రూతో రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్లుగా సంకేతాలిచ్చింది. అఫ్‌కోర్స్, అవును వాళ్లిద్దరూ గొడవ పడ్డారనుకోండి. సినిమాల్లో అవకాశాల్లేక, ప్రియుడి తోడు లేక మరి ఇల్లీ బ్యూటీ ఏం చేస్తోందట పాపం.. అంటే, చాలా పెద్ద బరువు బాధ్యతే పెట్టుకుందటండోయ్. అంటే, బరువు తగ్గే పని పెట్టుకుందట. ఇలియానా అంటే సన్నటి నడుము. సన్నటి నడుము అంటే, ఇలియానా.. అన్నట్లుగా బ్రాండ్ పడిపోయింది.
అలాంటి 'సన్న'జాజి నడుమున్న ఇలియానా గుండ్రంగా అంటే, బొద్దుగా ఉన్న బంతిపువ్వులా మారిపోయింది. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ఈ ఫిజిక్‌తో రీ ఎంట్రీ ఇచ్చి, ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. అయితే, అంత గుండ్రాటి ఫిజిక్‌లో ఇలియానాని ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేదు. దాంతో ఇలియానా సన్నగా ఉంటేనే బాగుంటుందని సూచించారు. ప్రస్తుతం ఇలియానా సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటోంది కూడా.
సో ఓ వైపు ఫ్యాన్స్ కోరిక, ఇంకో వైపు కెరీర్‌లో బిజీ కావాలన్న తన కోరిక నెరవేరాలంటే, తప్పదు తన బరువు బాధ్యతను కాస్త తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యిందట. దాంతో జిమ్‌లో ఎక్కువ టైమ్ గడుపుతూ, బరువు తగ్గే పనిలో బిజీ అయిపోయిందట. రేపో మాపో తన సన్నజాజి నడుముతో తిరిగి ఇలియానా దర్శనమివ్వనుందని తాజా సమాచారమ్.