2024 సంవత్సరం ముగియనున్నది. 2025 జనవరిలో సంక్రాతి బరిలో కొత్త సినిమాల జోరు ఉంటుంది. ఇప్పటికే చరణ్, బాలయ్య, వెంకీ లాంటి వాళ్లు పోటీకి సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి పోటీ వద్దనుకున్నవారు పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. కొందరు డిసెంబరులోనే రంగంలోకి దిగుతున్నారు. డిసెంబరు లో వచ్చే క్రిస్మస్ ని టార్గెట్ పెట్టుకుని కొన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. మొత్తంగా డిసెంబరు లో 11 సినిమాలు రిలీజ్ కానుండటం విశేషం. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 డిసెంబరు 5 న రిలీజ్ అవుతోంది. పుష్ప 2 పై అందరి కళ్ళు ఉన్నాయి. పుష్ప 2 ఉన్న కారణంగా చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. డిసెంబరు సెకండ్ వీక్ లో వేదిక లీడ్ రోల్ లో నటించిన 'ఫియర్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ వస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఈ సినిమా డిసెంబరు 14న రిలీజ్ అవుతోంది.
డిసెంబరు 20 న 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 1990 ల నాటి కథతో అల్లరి నరేశ్ నటించిన 'బచ్చలమల్లి', ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటించిన 'యూఐ' . విజయసేతుపతి హీరోగా గత ఏడాది వచ్చిన విడుదల మూవీకి సీక్వెల్ గా 'విడుదల: పార్ట్ 2', ఇదొక పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్. చాలా రోజుల తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన 'సారంగపాణి జాతకం'. కామెడీ జోనర్ లో రూపొందిన ఈ మూవీలో ప్రియదర్శి, రూప కొడువాయూర్ కీలక పాత్రల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని లీడ్ రోల్ లో నటించిన 'ఎర్రచీర: ది బిగినింగ్' యాక్షన్, మదర్ సెంటిమెంట్ తో సుమన్ బాబు తెరకెక్కించిన మూవీ. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమా 'ముఫాసా: ది లయన్ కింగ్' కూడా డిసెంబరు 20 న బరిలో దిగుతున్నాయి. వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సారా అర్జున్ లీడ్ రోల్ లో నటించిన 'మ్యాజిక్' డిసెంబరు 21న రిలీజ్ అవుతోంది. నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ డిసెంబరు 25న రిలీజ్ అవుతోంది. వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో తెరెకెక్కిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' డిసెంబరు 25న రిలీజ్ అవుతోంది. మహానటి కీర్తి సురేష్ నటించిన తోలి హిందీ సినిమా 'బేబీ జాన్' డిసెంబరు 25న రిలీజ్ అవుతోంది. 'పతంగ్' అనే సినిమా డిసెంబరు 27న థియేటర్లలో సందడి చేయనుంది.