‘గబ్బర్‌సింగ్‌’ ఎందుకంత ప్రత్యేకం.!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో చాలా హిట్‌ సినిమాలున్నాయి. అయితే, అన్నిట్లోకీ ‘గబ్బర్‌సింగ్‌’ చాలా ప్రత్యేకమైనది. అభిమానులు తమ అభిమాన హీరో సినిమా ఎలా వుండాలని కోరుకున్నారో, అలాంటి కమర్షియల్‌ హంగులన్నిటితోనూ కలిసొచ్చిన సినిమానే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. అంతకు ముందు వరుస ఫ్లాపులు చవిచూసిన పవన్‌ కళ్యాణ్‌ కూడా ‘గబ్బర్‌ సింగ్‌’ సక్సెస్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నిజానికి, పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ గురించి పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆయనది అదే తీరు. కానీ, ఆయన ‘గబ్బర్‌సింగ్‌’ని ఇప్పటికీ చాలా ప్రత్యేకమైన సినిమాగా చెబుతుంటారు.

 

బాలీవుడ్‌ సినిమా ‘దబాంగ్‌’కి తెలుగు రీమేక్‌ ఈ ‘గబ్బర్‌సింగ్‌’. హరీష్‌ శంకర్‌ పేల్చిన తూటాల్లాంటి మాటలు.. ఆయన, తన అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ని స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేసిన తీరు.. ఒకటేమిటి.? సినిమాలో అన్నీ అద్భుతాలే. అందుకే, ఏళ్ళు గడుస్తున్నా ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాకి క్రేజ్‌ తగ్గడంలేదు. అభిమానులు ఇంకోసారి ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాని యూ ట్యూబ్‌లోనూ, ఇతరత్రా మార్గాల్లోనూ సినిమాని ఎంజాయ్‌ చేస్తూ, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తున్నారు ఆ విశేషాలతో. ‘మళ్ళీ సినిమా కొత్తగా రిలీజైనట్లుంది..’ అంటూ హరీష్‌ శంకర్‌, అభిమానుల ఉత్సాహంపై వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మళ్ళీ హరీష్‌ శంకర్‌, ‘గబ్బర్‌సింగ్‌’ లాంటి మ్యాజిక్‌ని పవన్‌ కళ్యాణ్‌తో రిపీట్‌ చేయడానికి సిద్ధమవుతున్న విషయం విదితమే. ఈసారి ఆ సంచలనాలెలా వుంటాయో వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS