'జ‌గ‌దేక‌వీరుడు 2'... అదే పెద్ద సమస్య.

మరిన్ని వార్తలు

'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి' సినిమా నిన్ననే ముఫ్ఫై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇకపోతే గత పదేళ్ళుగా ఈ సినిమా సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి. నిర్మాత అశ్వనీదత్ ఈ సీక్వెల్ కి సిద్దంగా వున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ సినిమా సీక్వెల్ కి ఇదివరకే ప్లాన్స్ జరిగాయి. ముఫ్ఫై ఏళ్ళు నిండిన సందర్భంగా మరోసారి సీక్వెల్ ముచ్చట్లు వార్తల్లో నిలిచాయి. ఇదే ప్రశ్న అశ్వనీదత్ దగ్గర చాలా మంది ప్రస్తావించారు. ''చరణ్ బాబు హీరోగా ఈ సీక్వెల్ తీయాలని నేను చిరంజీవి గారు అనుకుంటున్నామని'' సమాధానం చెప్పారు దత్.

 

అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ కనుక తెరరూపం దాల్చితే ఎదురయ్యే సవాళ్లు ఏంటనే చర్చ నడుస్తుంది. హీరో గా రామ్ చరణ్ ఓకే. మెగా సినిమా కాబట్టి మెగా వారసుడు. అయితే వచ్చిన పెద్ద సమస్య అతిలోక‌సుంద‌రి ఎవరు ? శ్రీదేవిని మైమరపించే స్టార్ డమ్ వున్న కధానాయిక ఎవరు అంటే చెప్పడం కష్టమే. స్వయంగా చిరంజీవే అన్నారు ''శ్రీదేవి లేకపోతే ఈ సినిమానే లేదు''అని. అలాంటి అతిలోక‌సుంద‌రి వెతికి పట్టుకోవడం యూనిట్ ముందు వుండే పెద్ద సవాల్. ఇక మరో విషయం కధ. నిజానికి ఈ సినిమా తర్వాత మరో సోషియో ఫాంటసీ కధ హిట్ అయినట్లు దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. ఇలాంటి కధని రెడీ చేయడం, ఈ కాలానికి తగట్టు మార్చడం కూడా కత్తిమీద సామే. అయితే జ‌గ‌దేక‌వీరుడుకి మాత్రం మాంచి బ్రాండ్ వుంది. ఈ సీక్వెల్ ప్రకటన చాలు.. సినిమాపై స్కై లెవల్ లో అంచనాలు పెరగడానికి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS