నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ అవతారం ఎత్తిన సినిమా `వైల్డ్ డాగ్`. ఓ ముష్కర నాయకుడ్ని పట్టుకోవడానికి చేసిన సాహసాల గాథే ఈ సినిమా. శుక్రవారం విడుదలైంది. తొలిరోజు మంచి టాకే వచ్చింది. కాకపోతే.. వసూళ్లే చాలా నీరసంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం 1.33 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రానికి దాదాపుగా 9 కోట్ల వరకూ మార్కెట్ జరిగింది. అదంతా రాబట్టుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది.
తొలి రోజు లెక్కలివి!
నైజాం 53 లక్షలు
సీడెడ్ 19 లక్షలు
ఉత్తరాంధ్ర 16 లక్షలు
ఈస్ట్ 7 లక్షలు
వెస్ట్ 6 లక్షలు
గుంటూరు 7 లక్షలు
కృష్ణా 8 లక్షలు
నెల్లూరు 5 లక్షలు
ఏపీ + తెలంగాణ (మొత్తం) 1.21 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 6 లక్షలు
ఓవర్సీస్ 6 లక్షలు
వరల్డ్ వైడ్ (మొత్తం) 1.33 కోట్లు