'మిఠాయి' పిల్లకి ఈ సారైనా హిట్టొస్తుందా.?

మరిన్ని వార్తలు

'అమీ తుమీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తెలుగు భామ అదితీ మేఖల్‌. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. లేటెస్ట్‌గా అదితీ 'మిఠాయి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ నలుగురు కుర్రాళ్లకు సంబంధించిన డిఫరెంట్‌ స్టోరీస్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. 

 

రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్‌ కామరాజు, రవివర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నలుగురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. డార్క్‌ కామెడీ చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సినిమాలోని నలుగురు ముద్దుగుమ్మలతో పాటు అదితీ మేఖల్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగమ్మాయ్‌. మంచి విషయం ఉంది. 

 

అయితే సరైన హిట్‌ దక్కితేనే కదా, పాపులర్‌ అయ్యేది. ఆ హిట్‌ ఈ సినిమాతో దక్కనుందని ఆశిస్తోందీ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోవడం కూడా అమ్మడికి అలవాటే. ఈ మధ్య డార్క్‌ కామెడీ చిత్రాలు అనూహ్యంగా విజయం సాధిస్తున్నాయి తెలుగులో. అలా ఈ పిల్లకీ లక్కు చిక్కి 'మిఠాయి'లోని తియ్యదనం ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసి, సినిమాని హిట్‌ చేశారంటే, మన తెలుగమ్మాయి అదితీ పాపులర్‌ అయిపోవడం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS