తెలుగులో సంచలన విజయం అందుకున్న 'అర్జున్‌రెడ్డి' మూవీని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తుండగా, తమిళ 'అర్జున్‌రెడ్డి' విషయమై ఈ మధ్య ఓ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో దాదాపు సినిమా పూర్తయిపోయాక, అర్ధాంతరంగా సినిమాని ఆపేశారు. డైరెక్టర్నీ, ఇతర టెక్నీషియన్లనూ మార్చేసి సినిమాని మొదట్నుంచీ మళ్లీ చిత్రీకరించేందుకు సిద్ధపడ్డారు.
ఈ క్రమంలో డైరెక్టర్ బాలనీ, హీరోయిన్ మేఘా చౌదరిని పక్కకు తప్పించేశారు. సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ తెరంగేట్రం చేస్తున్న మూవీ ఇది. వర్మ టైటిల్‌తో రూపొందించారు. తాజాగా ఈ సినిమాకి ముందున్న హీరోయిన్ మేఘా ప్లేస్‌లో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ బనితా సందు ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వెలువడ్డాయి.
కానీ ఇలా ఓ ప్రముఖ డైరెక్టర్‌కి అవమానం జరిగిన ఈ సినిమాలో తాను నటించనని జాన్వీ తేల్చి చెప్పేసిందనే ప్రచారం జరిగింది. మొత్తానికి బనిత సందు ఎంపికపై ఆ వార్తలకు చెక్ పడినట్లే. ఇకపోతే బనితా 'అక్టోబర్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది. తొలి సినిమాతోనే యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఆమె టాలెంట్ మెచ్చి 'వర్మ' టీమ్ కోలీవుడ్‌కి తీసుకొచ్చింది. చూడాలి మరి కోలీవుడ్‌లో బనిత ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో.