సెన్సేషనల్ హీరోగా పాపులరైన విజయ్ దేవరకొండ మానవత్వాన్ని, మంచితనాన్ని చాటుకోవడంలో కూడా ముందుంటాడు. గతంలో కేరళ వరద బాధితుల కోసం మొదటగా స్పందించి వారికి ఆర్ధిక సాయం చేసి మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలిచాడు. తాజాగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 42మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుండి పలువురు హీరోలు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మన భారత సైనికులపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని కాల్చి చంపేయాలి.. అంటూ కసిగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇంకొంచెం ముందడుగు వేసి, ప్రాణాలు కోల్పోయిన ఆ జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచాడు. తనకు తోచిన ఆర్ధిక సాయం చేశాడు. ఎంత అమౌంట్ ఇచ్చాడనే విషయంపై క్లారిటీ లేదు కానీ, వారికి సాయం చేసిన సర్టిఫికెట్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
నిజానికి పలువురు ప్రముఖులు ఇప్పటికే జవాన్ కుటుంబాలకు సాయం అందించారు. కానీ వారెవరి పేర్లు బయటకి రాలేదు. అయితే విజయ్‌దేవరకొండ చేసింది ఒక రకంగా పబ్లిసిటీ స్టంటే అయినా కానీ, ఈ క్రమంలో మిగిలిన హీరోలు కూడా ముందుకొచ్చి తమ వంతు సాయం అందించేందుకు ఇదో ప్రేరణగా అవుతుంది. మంచి పని చేసినప్పుడు అందులో తప్పులు వెతకడం సబబు కాదు.
They protect our families.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 15, 2019
We must stand by the families of our soldiers.
No contribution can be substantial for our soldiers' lives, but we have to do our bit, I've done mine.
Together let's Contribute, together we will create a support system.https://t.co/pHp7ITOdit pic.twitter.com/G9ztDj0gvI