తమిళంలో ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన 'నాచియార్' చిత్రం ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతన్నాయా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తమిళంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక పాత్ర చాలా రఫ్‌గా ఉందనీ, ఆ పాత్ర చేత పలు అభ్యంతరకర డైలాగ్స్‌ని పలికించారనీ, విడుదలకు ముందు ఈ సినిమా వివాదాల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలయ్యాక వివాదాలన్నీ పటాపంచలైపోయి, ప్రశంసల వర్షం కురిసింది. అలా అక్కడ ఘన విజయం సాధించింది ఈ 'నాచియార్' సినిమా.
ఈ సినిమా తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాత కల్పనా కోనేరు సొంతం చేసుకున్నట్లు తాజా సమాచారమ్. అయితే జ్యోతిక నటించిన ఆ క్రిటికల్ పోలీసాఫీసర్ పాత్రలో టాలీవుడ్ నుండి నటించగల సత్తా ఉన్న హీరోయిన్ ఎవరంటే, ఇంకెవరు, లేడీ సూపర్‌స్టార్ అనుష్క అనే అంటున్నారు. ఈ మధ్యనే 'భాగమతి' సినిమాతో అనుష్క సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది 'భాగమతి'. సోఈ సినిమాలో లీడ్ రోల్ పోషించే సత్తా అనుష్కకే ఉందని చెప్పక తప్పదు. అయితే అనుష్క అంటేనే స్వీటీ బ్యూటీ.
మరి అలాంటి అనుష్క చేత అసభ్యకరమైన డైలాగ్స్ పలికించడం అంటే అది సాధ్యమేనా? ప్రేక్షకులు, ప్రత్యేకించి అనుష్క అభిమానులు అందుకు అంగీకరిస్తారా? రీమేక్ కాబట్టి, తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, మన నేటివిటీకి తగ్గట్లుగా డైలాగుల్లో చిన్నా చితకా మార్పులు చేయాల్సి ఉంటుంది. అనుష్కతోనే ఈ సినిమాని తెరకెక్కిస్తారా? లేక ఇంకెవరితోనైనానా అనే విషయంలో ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, అనుష్క ఈ సాహసానికి అసలు ఒప్పుకుంటుందో లేదో చూడాలి మరి.