బాలయ్య సినిమాతో చాందిని దశ తిరగనుందా?

మరిన్ని వార్తలు

తెలుగు అందం చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టి కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరవాత చిన్న చిన్న క్యారక్టర్స్ కూడా చేసింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక పాత్రల్లో నటించింది. సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటోలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడ నటించింది. ఇందులో 'ఝాన్సీ' వెబ్ సిరీస్ ఒకటే చెప్పుకోదగినది. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో  'గామి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో చాందిని నటనా పరంగా మంచి మార్కులే సంపాదించింది. ప్రస్తుతం మూడు సినిమాలు చాందిని చేతిలో ఉన్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో లీడ్ రోల్స్ చేస్తోంది. ఇవి కాకుండా బాలకృష్ణ, బాబీ కాంబో మూవీలో కూడా నటిస్తోంది. 


తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాలలో మంచి గుర్తింపు దక్కదు అనటానికి చాందిని  ఉదాహరణ. అందం, అభినయం, అన్ని ఉన్నా అవకాశాలు రావటం లేదు. గ్లామర్ షో కి కూడా పెద్దగా అభ్యంతరాలు లేవు అయినా సరే టాలీవుడ్ లో టైర్ టూ హీరోల సినిమాల్లో కూడా చాన్స్  లు రావటం లేదు. ఇప్పుడు  బాలకృష్ణ బాబీ డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో చాందిని కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తానే స్వయంగా చెప్పింది. ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ అయిపోయిందని, ఇందులో తాను ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తున్నట్టు పేర్కొంది. అది కూడా ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయే పాత్ర కాదు ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ లో నటించినట్లు చెప్పింది. 


చాందిని ఎట్టకేలకు బడా స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అదీ కథలో చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర కావటంతో, ఈ మూవీతో చాందినికి మరిన్ని అవకాశాలు పెరుగుతాయేమో. ప్రస్తుతం భాషా బేధాలు తొలగిపోయి అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కలిసి పని చేస్తున్న ఈ నేపథ్యంలో చాందినికి వేరే భాషల్లో ఛాన్స్ వచ్చినా తన కెరియర్ సెటిల్ అయినట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS