ఈమధ్య చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర బాగానే మెరుస్తున్నాయి. అందులో `మసూద` ఒకటి. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు పోషించిన హారర్ సినిమా ఇది. సాయి కిరణ్ దర్శకుడు. నవంబరు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. హారర్ అభిమానుల్ని అలరించింది. ఈ సినిమాలోని సౌండ్ ఎఫెక్ట్స్ గురించి, హారర్ ఎలిమెంట్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. బాక్సాఫీసు దగ్గర దాదాపుగా రూ.6 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఈనెల 21న ఆహాలో... మసూద స్ట్రీమింగ్ కానుంది. నిజానికి థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. హారర్ ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్ థియేటర్లోనే ఎక్కువ భయపెడతాయి. కాకపోతే.. మసూద కి మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాని ఓటీటీలో కూడా బాగానే చూస్తారన్న అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పైగా ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. సో.. మసూద ఓటీటీ పరంగానూ హిట్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.