కొణిదెల ప్రొడక్షన్స్‌లో రెండో చిత్రంగా రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఆ తర్వాత దసరా బరిలో ఉంచుతారేమో అనుకున్నారు. లేదు లేదు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికేనట అంటూ ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే లేటెస్టుగా 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతగా చరణ్ 'సైరా' అప్‌డేట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది.
ఆ క్రమంలో తెలిసిందేమంటే, 'సైరా'ని పోస్ట్ సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని చరణ్ తెలిపాడు. అయితే సినిమాల పరంగా దసరా, సంక్రాంతి మంచి సీజన్స్‌గా పరిగణిస్తారు కదా అని విలేఖరి అడిగిన ప్రశ్నలకు పోస్ట్ సమ్మర్‌లో విడుదలై మంచి ఫలితాలందించిన సినిమాలు కూడా ఉన్నాయి అంటూ 'మగధీర'ను ఎగ్జామ్‌పుల్‌గా చెప్పారు. సో 'మగధీర' సెంటిమెంట్‌తో 'సైరా నరసింహారెడ్డి' సినిమాను కూడా పోస్ట్ సమ్మర్‌లోనే విడుదల చేయబోతున్నారనీ అర్ధమవుతోంది.
అంతేకాదు, ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది మెగాస్టార్ చిరంజీవి. అలాగే కొరటాల శివతోనూ ఇంకో సినిమాకి ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాడు చిరంజీవి. అంటే చరణ్‌తో పాటు, చిరంజీవి నుండి కూడా ఏడాదికి ఓ సినిమా రానుందన్నమాట. ముఖ్యంగా 'సైరా' తర్వాత రెండు సినిమాలు అయితే ఖచ్చితంగా చిరంజీవి నుండి రావడం పక్కా. ఇక సైరా విషయానికి వస్తే, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.