చాలా కాలం తరవాత ప్రియమణి మళ్లీ తెరపై కొచ్చింది. ఓ సినిమాని గప్ చుప్‌గా పూర్తి చేసేసింది. దానికి `సిరి వెన్నెల` అనే పేరు కూడా పెట్టేశారు. దర్శకులు, నిర్మాతలు, ఇతర నటీనటులు అంతా కొత్తవారే. అయితే ఈ సినిమాపై ప్రియమణి చాలా ధీమా పెట్టుకుంది. ``నా సెకండ్ ఇన్నింగ్స్‌నికి ఇది మంచి ఆరంభం`` అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాకపోతే ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. ఈ ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదు. చుట్టూ పోటీ ఎక్కువగా ఉంది. కథానాయికగా గ్లామర్ పాత్రలు చేసే వయసు కాదాయె. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే ఎంచుకోవాలి. అయితే.. ఆ తరహా కథలకు మెల్లమెల్లగా కాలం చెల్లిపోతోంది. కథలో వైవిధ్యం ఉంటే తప్ప సినిమాలు చూడడం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మార్కెట్ కూడా సరిగా ఉండడం లేదు.
హారర్, థ్రిల్లర్ సినిమాలంటే తిప్పికొట్టేస్తున్నారు. కానీ ప్రియమణి ఇవేం పట్టించుకోకుండా అందరిలానే హారర్ కథని ఎంచుకుంది. జోనర్ అదే అయినా... అందులో ఏదో ఓ కొత్త పాయింట్ చూపింకచపోతే ప్రేక్షకులు ఆదరించడం లేదు. మరి ఆ కొత్తదనం ఈ `సిరి వెన్నెల`లో ఉందా, లేదా? అనేదాన్నిబట్టే ప్రియమణి సెకండ్ ఇన్సింగ్స్ జోరు ఆధారపడి ఉంటుంది.