'ఎఫ్‌ 3' కోసం రవితేజ కాదు, సునీల్‌ కాదు, మరెవరో తెలుసా.?

By Inkmantra - February 21, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి, సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసింది 'ఎఫ్‌ 2'. ఎట్‌ ఏ టైమ్‌ వెంకటేష్‌కీ, వరుణ్‌తేజ్‌కీ కూడా బ్లాక్‌ బస్టర్‌ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో అనిల్‌ రావిపూడి 'ఎఫ్‌ 2' సీక్వెల్‌కి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే 'ఎఫ్‌ 3'లో మోర్‌ ఫన్‌ యాడ్‌ అయ్యేందుకు మోర్‌ కాస్టింగ్‌ని కూడా యాడ్‌ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఆ మూడో స్టార్‌ ఎవరనే అంశంపై పలు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. వెంకీ, వరుణ్‌ స్టార్‌డమ్‌కి తగ్గట్లుగానే స్టార్‌డమ్‌ ఉన్న హీరోనే ఈ సినిమా కోసం ఎంచుకోవాలనే యోచనలో అనిల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆ యాంగిల్‌లో మాస్‌ రాజా రవితేజ కరెక్ట్‌గా సెట్‌ అవుతాడని రవితేజతో ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయనీ సమాచారమ్‌ అందింది. కానీ తర్వాత రవితేజతో ఈక్వేషన్స్‌ సెట్‌ కాకపోవడంతో, సునీల్‌ని దించనున్నారట అనే వార్త హల్‌చల్‌ చేసింది. 

 

తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నితిన్‌ కూడా హిట్టు కోసం తహతహలాడుతున్నాడు. ఒకవేళ నితిన్‌కే ఈ ఛాన్స్‌ దక్కిందంటే పంట పండినట్లే. అయితే రవితేజ, సునీల్‌ ఈ ప్రాజెక్టుకు నో అన్నట్లు క్లారిటీ లేదు. అలాగే నితిన్‌ ఓకే అయినట్లూ పక్కాగా సమాచారమ్‌ లేదు. సో ఎక్స్‌ట్రా ఫన్‌ పంచే ఆ 'ఎఫ్‌ 3' ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS