పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణూదేశాయ్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఆమె రెండు చిత్రాలపై సంతకాలు చేసింది. ఈ విషయాన్ని రేణు అధికారికంగా ప్రకటించింది. ఓ సినిమాకి దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇందులో రేణూ సామాజిక వేత్తగా కనిపించనుంది. రచయిత హేమలత లవణంగా రేణూ నటించనుంది. ఇది కాకుండా మరో సినిమాపై కూడా రేణు సంతకాలు చేసింది. వచ్చేవారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
''తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. సామాజిక వేత్త, రచయిత హేమలత పాత్రలో కనిపిచబోతున్నా. వ్యక్తిగతంగా ఆమెపై చాలా అభిమానం ఉంది. ఈ పాత్ర పోషించడం ఓ గౌరవంగా అనిపిస్తోంది'' అంటోంది రేణూ. 'ఇష్క్ వాలా లవ్' అనే ఓ మరాఠి చిత్రాన్ని రేణూదేశాయ్ రూపొందించారు. ఆ తరవాత... సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా రేణూ 'నో' చెప్పేది. పవన్ కల్యాణ్ ఇష్యూతో.. ట్విట్టర్లో కొంతకాలం హల్ చల్ చేసింది. ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతోంది. త్వరలో ఇంకెన్ని ఆఫర్లు అందుతాయో చూడాలి.