గత వారం విడుదలైన `వలర్డ్ ఫేమస్ లవర్` తొలి రోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఈ సినిమాని గట్టెక్కించలేకపోయాయి. తొలి రోజు వసూళ్లు ఓకే అనిపించినా.. ఆ మరుసటి రోజు నుంచే డౌన్ ఫాల్ మొదలైంది. తొలి వారం ఈ సినిమాకి కేవలం 9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ శుక్రవారం భీష్మ రాకతో.. రౌడీ ఖేల్ ఖతం అయినట్టే. దాంతో ఈ సినిమా నష్టాలెంత? అనేది లెక్క వేస్తున్నారు. దాదాపుగా అన్ని ఏరియాల్లో బయ్యర్లు 70 శాతం నష్టపోయే అవకాశాలులన్నాయని తెలుస్తోంది. దాదాపుగా 20 కోట్లు నష్టాలు వాటిల్లే ఛాన్స్ ఉంది.
విజయ్ దేవరకొండ తన వంతుగా పారితోషికంలోని కొంత మొత్తం వెనక్కి తిరిగి ఇచ్చాడని తెలుస్తోంది. ఎంత ఇచ్చినా.. నిర్మాత కె.ఎస్.రామారావుని అప్పుల్లోంచి గట్టెక్కించలేమని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి. మొత్తానికి వరల్డ్ ఫేమస్ లవర్కాస్త వరస్ట్ రిపోర్ట్ అందించాడు.