నాగార్జునకి కధల ఎంపిక విషయంలో మంచి జడ్జమెంట్ వుందంటారు. కానీ కొన్ని సార్లు ఆయన లెక్క తప్పుతుంటుంది, మరీ నాసిరకమైన కధలకు ఓకే చెబుతుంటారు. నాగ్ కెరీర్ బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాఫ్ అంటే రీసెంట్ టైమ్స్ లో 'భాయ్', అఫీషర్ సినిమా పేర్లు వినిపిస్తాయి. అయితే వాటిని బీట్ చేసిన ఫ్లాఫ్ ఈ ఏడాది వచ్చింది. అదే మన్మథుడు 2. నాగార్జున కెరీర్ లో 'మన్మథుడు' లాంటి సూపర్ హిట్ టైటిల్ ని వాడుకుని చేసిన ఈ సినిమా.. దారునమైన ఫలితాన్ని చూసింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో చెత్త సినిమా జాబితాలోకి వెళ్ళింది.
కధలో కొత్తదనం లేకపోక చెత్తదనం వచ్చి చేరింది. నాగ్ ని 'రొమాన్స్ కింగ్' అని చూపించే క్రమంలో దర్శకుడు చూపించిన క్రియేటివి నవ్వులు పాలు చేసింది. బెడ్ రూమ్ సీన్స్ లో తలుపులు, గోడలు భూకంపం వచ్చినట్లు వూగిపోవడం.. అమ్మాయిల వాసన పసిగ్గట్టే సీన్లు.. ఒక్కటి కాదు.. చాలా దారుణమైన క్రియేటివిటితో భయపెట్టిందీ సినిమా. పైగా ఈ సినిమా కధని ఫ్రెంచ్ నుండి కొన్నారు. 'డబ్బులు కోసం ప్రియురాలిగా నటించే ఓ అమ్మాయి''కధ. పాపం.. నాగార్జున, మోహన్ బాబు చేసిన ''అల్లుడుగారు'' సినిమా చూడాల్సింది. కధ కొన్న ఖర్చు మిగిలేది.. ఓ చెత్త సినిమా నుండి తప్పించుకునే ఛాన్స్ వుండేది. బట్ టూ లేట్.