యమ్మీ యమ్మీ రొమాంటిక్‌ గ్లామర్‌.!

By iQlikMovies - August 08, 2018 - 11:10 AM IST

మరిన్ని వార్తలు

మోడలింగ్‌ రంగం నుండి వచ్చి హీరోయిన్‌గా సెటిలైన ముద్దుగుమ్మ యామీ గౌతమ్‌. హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో శిరీష్‌ సరసన 'గౌరవం' చిత్రంలోనూ, నితిన్‌తో 'కొరియర్‌బోయ్‌ కల్యాణ్‌' చిత్రంలోనూ నటించింది. కానీ ఈ రెండు సినిమాలు పాపకి అంతగా పాపులారిటీ తెచ్చిపెట్టలేదు. హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. హృతిక్‌ రోషన్‌తో నటించిన 'కాబిల్‌' చిత్రం యామీకి మంచి గుర్తింపుతో పాటు, సక్సెస్‌నీ అందించింది. ఇకపోతే తాజాగా అమ్మడు హాంకాంగ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి రొమాంటిక్‌ లొకేషన్స్‌ని తన కెమెరాలో బంధించి, ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. చూస్తున్నారుగా నింగిని తాకుతున్నట్లుగా ఉన్న సౌధా సౌందర్యం చీకట్లో మిరుమిట్లుగొలిపే విద్యుత్‌ కాంతులతో ధగధగా మెరిసిపోతుంటే, ఆ మెరుపుల మధ్య తన అందాల జిలుగులు ఇంకెంతగా మెరిసిపోతున్నాయో చూడండి. అస్సలు ఆలస్యం చేయకుండా, ఆ రొమాంటిక్‌ లొకేషన్స్‌నీ, అమ్మడి హాట్‌ హాట్‌ అందాల్నీ ఓ లుక్కేస్కోవాల్సిందే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS