'పిచ్చిపిచ్చిగా నచ్చావురా..' ఇప్పుడీ వీడియో సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఏ సినిమాలోనిదీ సాంగ్ అంటే, 'నర్తనశాల'. యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం. యామినీ భాస్కర్ హీరోయిన్గా నటిస్తోంది. సాంగ్‌ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇదో బీచ్ సాంగ్ అన్న మాట.
విడుదలైన కాస్సేపట్లోనే వ్యూస్ పోటెత్తుతున్నాయి. ఈ సాంగ్‌లో కనిపించిన ముద్దుగుమ్మ యామినీ భాస్కర్ ఆ రేంజ్లో ఎట్రాక్ట్ చేస్తోంది మరి. ఫుల్ హాట్నెస్. నాగశౌర్య, యామినీ భాస్కర్ కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందీ సాంగ్‌లో. ఇంతకీ ఈ యామినీ భాస్కర్ ఎవరో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'కాటమరాయుడు' చిత్రంలో పవన్ మరదళ్లలో ఒకరిగా నటించిందీ ముద్దుగుమ్మ. గుంపులో గోవిందా అంటూ ఆ సినిమాలో పెద్దగా రిజిస్టర్ కాలేదు. కానీ, ఈ సినిమా రిలీజ్ కాకముందే తన గ్లామర్‌తో రిజిస్టర్ అయిపోయింది. ఈ ఒక్క సాంగ్ చాలు అన్నట్లుగా విచ్చలవిడిగా గ్లామర్ షో చేసిందీ ముద్దుగుమ్మ.
ఇటీవల విడుదలైన టీజర్లో నాగశౌర్యని 'గే' లక్షణాలున్న అబ్బాయిగా చూపించారు. టీజర్ ఫన్నీగా డిజైన్ చేశారు. లేటెస్టుగా రిలీజైన సాంగ్‌తో హాట్ అప్పీల్ చూపించారు. ఇంకెన్ని షేడ్స్ ఉన్నాయో సినిమాలో మచ్చుకొకటి అన్నట్లుగా త్వరలోనే రివీల్ చేయనున్నారట. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
'ఛలో' సినిమాతో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగశౌర్య. అదే జోష్‌తో ఈ సినిమాని కూడా సొంత బ్యానర్లో రూపొందిస్తున్నాడు.