KGF సినిమాతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చి పానిండియా స్టార్ అయిపోయాడు కన్నడ హీరో యశ్. KGF తరవాత యశ్ 'టాక్సిక్' అనే మూవీ తో రాబోతున్నాడు. ఇదే కాకుండా నితీష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడిగా నటిస్తున్నాడు యశ్. ఈ సినిమాతో ఒక రికార్డ్ క్రియేట్ చేసాడు యశ్. ప్రజంట్ యశ్ కి సంబధించిన ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇప్పుడు ఇండియన్ సినిమాలో హీరోతో సమానంగా విలన్ క్యారక్టర్ కూడా ఉంటోంది. హీరో ఫిక్స్ అవగానే విలన్ ఎవరన్న చర్చ మొదలవుతోంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోలు కూడా విలన్స్ గా నటించటానికి ముందుకు వస్తున్నారు. ఒకే చట్రంలో ఇరుక్కోకుండా, తమ ఇమేజ్ ని పక్కన పెట్టి నెగిటీవ్ రోల్స్ లో తమ నటనా ప్రాభవాన్ని చూపుతున్నారు. యశ్ కూడా అందుకే రామాయణం సినిమాలో రావణుడి పాత్ర కోసం ఓకే చెప్పాడు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ తో బాలీవుడ్ లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. పురాణంలో రావణుడి ఆహార్యం, ఆకారం ఎలా ఉంటుందని విన్నామో, వాటికి కరెక్టుగా నప్పేలా ఉంటాడు యశ్. అందుకే నితీష్ తివారీ ఈ పాత్ర కోసం యశ్ ని అనుకున్నాడు. ఈ న్యూస్ విన్న ఫాన్స్ కూడా సంతోషించారు.
ఇప్పుడు ఈ రావణ్ పాత్రే యశ్ ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ సినిమాలో రావణుడి పాత్రకు యశ్ 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ పారితోషికం తీసుకునే విలన్‌గా యశ్ రికార్డ్ కెక్కాడు. ‘కల్కి 2898 AD’ సినిమాలో విలన్ గా నటిస్తున్న కమల్‌హాసన్ 25 కోట్లు తీసుకుంటున్నాడు. ఒక విలన్ కి ఇచ్చిన భారీ పారితోషికం ఇదే అనుకున్నారు. కానీ ఇప్పుడు యశ్ ఏకంగా 150 కోట్లతో ఆ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. ఒక విలన్ రెమ్యునరేషన్ లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు.