వైల్డ్‌ అండ్‌ హాట్‌ 'ఏడు చేపల కథ'.!

మరిన్ని వార్తలు

వైల్డ్‌ అండ్‌ బోల్డ్‌ కంటెన్ట్స్‌ అంటే చాలా అరుదుగా మాత్రమే వెండితెరపై సందడి చేసేవి. అందులోనూ తెలుగులో ఈ తరహా కంటెన్ట్‌ మూవీస్‌ చాలా చాలా తక్కువ. అలాంటిదిప్పుడు తెలుగు సినిమా ఈక్వేషన్స్‌ మారిపోయాయి. బోల్డ్‌ కంటెన్ట్స్‌ని చాలా సులువుగా తెరకెక్కించేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. వాటికి ప్రేక్షకులు కూడా అంతే సులువుగా బ్రహ్మరధం పట్టేస్తున్నారు. 

ఇప్పుడీ కథంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, తాజాగా బోల్డ్‌ అండ్‌ వైల్డ్‌ కంటెన్ట్‌ మూవీ ఒకటి అతి త్వరలోనే ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది. సినిమా పేరేమంటారా? 'ఏడు చేపల కథ'. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నట్లుంది కదా. అవును ఆ చేపల కథే. కానీ ఇక్కడ రాజుగారు వేరు, చేపలు కూడా వేరే. అసలు కథేంటంటారా? ఈ సినిమా టీజర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అది చూస్తే మీరే ఓ ఐడియాకొచ్చేస్తారు. ఇది పక్కా. అయితే ఈలోగా చిత్ర యూనిట్‌ కొన్ని హింట్స్‌ ఇచ్చింది. 

లేటెస్టుగా ఓ రెండు పోస్టర్స్‌లు బయటికి వదిలింది. బీచ్‌ ఒడ్డున నగ్నంగా పడుకుని ఉన్న కుర్రోడు. చుట్టూ అమ్మాయిలు వారిది కూడా అదే పరిస్థితి (నగ్నంగానే). ఆ కుర్రోడి నోట్లో ఒక చేప, ఒంటి మీద కొన్ని చేపలు, పక్కనే ఓ రాయి మీద అమ్మాయిల ఇన్నర్‌.. ఇదీ ఈ పోస్టర్‌ కథ. చాలా బోల్డ్‌గా, అంతకంటే వైల్డ్‌గా ఈ పోస్టర్‌ని వదిలేశారు మరి. 

ఇంతకు ముందూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఆ పోస్టర్‌ కథ కూడా 'ఛీ.' ఇలాంటిదే. పోస్టర్స్‌తో ఇలా రెచ్చగొడుతున్న ఈ సినిమా కథా కమామిషు ఏంటో అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ స్టార్ట్‌ అయిపోయింది. సహజమే కదా. అభి అనే కుర్రోడు ఈ సినిమాలో హీరోగా నటించాడు. బిగ్‌బాస్‌ భానుశ్రీ ఈ సినిమాలో కనిపించబోతోంది. చరిత సినిమా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు శామ్‌.జె.చైతన్య. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS