ఇంటర్నెట్‌లోకి వదిలేసి, 18 ఏళ్ళ వయసు పైబడిన వారికి మాత్రమే అంటే ఎలా? 'ఏడు చేపల కథ' అనే సినిమా ఒకటొస్తోంది.. దాంట్లో 'కథ' ఏమీ లేదు, అంతా 'బూతు' మాత్రమే. హీరోకి మతి మరుపు వుంటే 'భలే భలే మగాడివోయ్'. హీరోకి అతి శుభ్రం వుంటే 'మహానుభావుడు'. అదే హీరోకి, ఎక్స్‌పోజింగ్ చేసే ఆడాళ్ళని చూసి కంట్రోల్ లేకపోతే 'ఏడు చేపల కథ'. ఇదండీ సంగతి.
డాక్టర్ దగ్గరకు హీరో వెళ్ళి తనకున్న రోగం గురించి చెప్పడం, డాక్టర్ సైతం ఆశ్చర్యపోవడం టీజర్‌లో చూపించారు. అయినా, టీజర్‌లో చూపించకపోవడానికేముంది.? మొత్తం చూపించేశారు. ఈ సినిమా కోసం ఎక్కడా ఆడాళ్ళని వేధించలేదంటూ ఓ 'నోట్' కూడా వేసేశారండోయ్. అత్యంత జుగుప్సాకరం కేటగిరీలో ఈ 'ఏడు చేపల కథ' టీజర్‌కి అవార్డ్ ఇచ్చేయొచ్చు. తెలుగు సినిమా ఎదిగిపోతోంది, అడల్ట్ మార్క్‌ని అందేసుకుందని చెప్పుకోవడానికి ఈ సినిమానే నిదర్శనం.
టీజర్‌లోనే ఇలా వుంటే, ట్రైలర్ ఇంకెలా వుంటుందో.. సినిమా ఇంకెలా వుంటుందో! న్యూడిటీ అనేది పీక్స్‌లో వుండబోతోందట. దీన్ని పోర్న్ సినిమా అనుకోవచ్చా? అంటే, ఏమో ఇప్పుడే చెప్పలేం అని కొందరు సమాధానమిస్తున్నారు. ఏడు చేపల కథ.. అనగానే, చిన్నప్పటినుంచీ వింటోన్న ఓ కథ గుర్తుకొస్తుంటుంది చిన్న పిల్లలకి. ఆ చిన్న పిల్లలు మాత్రం ఈ 'ఏడు చేపల కథ' సినిమా చూడ్డానికి వీల్లేదు. వీల్లేదని డిక్లరేషన్ ఇచ్చారుగానీ టీజర్‌లో, ఆల్రెడీ ఈ టీజర్ ఇంటర్నెట్‌లోకి ఎక్కేశాక అంతా చూసేశారు.
బాబోయ్, ఇదేం టీజర్! అని పెద్దోళ్ళూ ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.