చిరంజీవి తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందట. త్వరలోనే గుమ్మడికాయ కొట్టేయనున్నారట. కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహాయించి మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న తాజా సమాచారమ్. అనుకున్న టైం కన్నా ముందే షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఔట్ పుట్ అనుకున్నదానికన్నా చాలా చాలా బాగా వచ్చిందట.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకి 'సైరా' టీమ్ సన్నాహాలు చేయనుందట. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అనే లిమిట్ పెట్టుకోకుండా, నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు నిర్మాత రామ్‌చరణ్. యుద్ధ సన్నివేశాలే కీలకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం యాక్షన్ ఘట్టాల్ని చాలా పవర్‌ఫుల్‌గా, లైవ్‌గా చిత్రీకరించేందుకు సైరా టీమ్ చాలా కష్టపడింది. త్వరలో యాక్షన్ ఘట్టాలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని రిలీజ్ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట.
చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా' చిరంజీవి కెరీర్‌లోనే గొప్ప చిత్రంగా నిలిచిపోవాలని కొడుకు రామ్‌చరణ్ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు, ఆ కష్టం అంతా తెరపై కనిపించనుందట. వివిధ భాషల నుండి పలువురు సినీ ప్రముఖులు సైరాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రాగానే, సినిమాని ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేయనున్నారట రామ్‌చరణ్ అండ్ కో.