ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో మెగా డాటర్ నిహారిక ఓ కీలక పాత్ర పోషిస్తోందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా నిహారిక పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసిందట సైరా టీమ్. ఇంతకీ నిహారిక ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తోందంటే, ఆపద సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆశ్రయం కల్పించే ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోందట.
నిడివి చాలా తక్కువే అయినా ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో తాను కూడా ఓ చిన్న భాగమైనందుకు నిహారిక చాలా సంతోషంగా ఉందట. భారీ కాస్టింగ్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు.
కానీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్న కారణంగా దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. కాగా మిల్కీబ్యూటీ తమన్నా మరో కీలకపాత్రలో కనిపించనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.