దాదాపు 22 ఏళ్ల తర్వాత 'ఇండియన్' సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఈ మధ్య పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. సినిమా ఆగిపోయిందనీ, బడ్జెట్ విషయంలో నిర్మాతలకూ, డైరెక్టర్ శంకర్‌కీ మధ్య విబేథాలు తలెత్తాయనీ, అంతేకాదు, హీరో కమల్‌హాసన్‌కీ, శంకర్‌కీ మధ్య కూడా పొత్తు కుదరడం లేదనీ.. రకరకాల గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ ఉత్తదేనని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'ఇండియన్ 2' షూటింగ్ ఆగిపోలేదనీ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతోందనీ తాజాగా అందుతున్న సమాచారమ్. 'ఇండియన్'కి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించగా, ఈ సీక్వెల్‌కి యంగ్ దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర బాణీలు సమకూరుస్తున్నారు. నిజానికి 'ఇండియన్ 2' ప్రస్థావన రెండేళ్ల క్రితమే శంకర్ తన వద్దకు తీసుకొచ్చారనీ, అప్పుడే కొన్ని ట్యూన్స్ సిద్ధం చేసి ఉంచాననీ, ఆ ట్యూన్స్ పట్ల శంకర్ సంతృప్తిగానే ఉన్నారనీ అనిరుధ్ తెలిపాడు.
మిగిలిన ట్యూన్స్‌ని సిద్ధం చేసే పనిలో అనిరుధ్ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'అజ్ఞాతవాసి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ బిజీగానే ఉన్నాడు. వరుసగా నాని నటిస్తున్న 'జెర్సీ', 'గ్యాంగ్‌లీడర్' ఈ రెండు సినిమాలకు అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నాడు.