'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌': టైమింగ్‌ అదిరింది.!

By Inkmantra - March 01, 2019 - 12:07 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌'. తాజాగా ఈ సినిమా నుండి ఓ లుక్‌ బయటికి వచ్చింది. 'ఘాజీ బాబా' అంటూ ఓ క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ ఈ లుక్‌ని విడుదల చేశారు. ఇదో టెర్రరిస్ట్‌ క్యారెక్టర్‌. ఇంతకీ ఈ పాత్ర పోషించిందెవరో తెలుసా.? మాటల రచయితగా అందరికీ సుపరిచితుడు అబ్బూరి రవి. పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు అచ్చంగా అతికిపోయాడు. 

 

ప్రస్తుతం ఇండియా - పాకిస్థాన్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ లుక్‌ని విడుదల చేసి, చిత్ర యూనిట్‌ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈ తాజాలుక్‌ గురించి అంతటా చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఈ లుక్‌పై సీరియస్‌గా చర్చ నడుస్తోంది. కాగా సినిమాలో ఆది ఎన్‌ఎస్‌జీ కమాండోగా నటిస్తున్నాడు. షాషా ఛత్రి, నిత్యా నరేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

సాయికిరణ్‌ అడవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజా పరిణామాల దృష్ట్యా విడుదలైన ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఫిక్షనల్‌ మూవీ ఇది. హీరోగా పరిచయమై చాలా కాలమే అయినప్పటికీ సరైన బ్రేక్‌ లేక తంటాలు పడుతోన్న ఆదికి ఈ సినిమాతోనైనా బ్రేక్‌ వస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS