దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం 'యాత్ర' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేశారు. తెలుగు స్టేట్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం సందడిగా కనిపించింది. ధియేటర్స్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో అభిమానులు పోటెత్తారు. సాధారణ అభిమానులు తక్కువగానే కనిపించారు.
కానీ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎక్కువగా సందడి చేశారు. మామూలు కమర్షియల్ సినిమాగా కాకుండా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన సినిమాగానే యాత్ర జనాల్లోకి వెళ్లింది. 'యాత్ర బిగిన్స్' అనీ, 'వాక్ విత్ వైఎస్సార్' అనే హ్యాష్ ట్యాగ్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు హోరెత్తించేస్తున్నారు. మరోవైపు 'యాత్ర'కు ఓవర్సీస్‌లో కూడా అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్లుగానే అక్కడ కూడా 'యాత్ర' సినిమాని అత్యథిక ధియేటర్స్‌లో రిలీజ్ చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, వైఎస్సార్ తన పాదయాత్రను 68 రోజులు నిర్వహించగా, యాత్ర డైరెక్టర్ మహి.వి.రాఘవ ఈ సినిమా చిత్రీకరణకు తీసుకున్న టైం కూడా అంతే కావడం విశేషం. మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందింది ఈ సినిమా. అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.