'యాత్ర' సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయట. వైఎస్సార్ సీపీ నుండి ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగా జరుగుతన్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్‌లో ఈ సినిమాని లోకల్ కేడర్ నేతలు ప్రెస్టీజియస్‌గా తీసుకుని భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారనీ సమాచారమ్. దాంతో ఫస్ట్‌డే మంచి క్రౌడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే, జనాన్ని ఎట్రాక్ట్ చేయడమెలాగో జగన్‌గా తెలిసినంతగా మరొకరికి తెలియదనే చెప్పాలి. అదే ఈ సినిమాకి కూడా బాగా ప్లస్ అయ్యేలా ఉంది. రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అమితమైన అభిమానం ఆడియన్స్‌ని పెద్ద ఎత్తున ధియేటర్స్‌కి రప్పించేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎలక్షన్స్ తరుణం ఆసన్నమైంది. ఈ సమయంలో జగన్ మెప్పు పొందడం కోసం వైఎస్సార్ సీపీలోని కింది స్థాయి నేతలు 'యాత్ర'ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమాకీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని డైరెక్టర్ మహి.వి.రాఘవ చెబుతున్నారు. ఇదో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిందని పేర్కొంటున్నారు. అయితే సినిమా విడుదల దగ్గర పడేకొలదీ రాజకీయ రంగు పులుముకుంటోంది 'యాత్రం'. రేపు అనగా ఫిబ్రవరి 8న 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ నటుడు ముమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.