మలయాళ ముద్దుగుమ్మలకి తెలుగు పరిశ్రమతో మంచి అనుబంధ బాంధవ్యాలున్నాయి. వస్తూ వస్తూనే యాక్టింగ్ టాలెంట్‌తో అడుగు పెడుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇప్పటికే చాలా మంది కేరళ కుట్టిలు తెలుగులో తమ హవా కొనసాగిస్తున్నారు. అదే కోవలో తాజాగా మరో ముద్దుగుమ్మ చేరనుంది. 'యమన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఆ ముద్దుగుమ్మే మియా జార్జ్. ఈ ముద్దుగుమ్మ సునీల్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో కూడా నటిస్తోంది. 'యమన్'లో అమ్మడు ఓ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అంటే ఫుల్ గ్లామర్ అన్నమాట. అందులోనూ అమ్మడికి గ్లామర్ విషయంలో ఏమీ హద్దుల్లేవని చెబుతోంది. కథను బట్టి, సిట్యువేషన్‌ని బట్టి ఎలాంటి గ్లామరస్ పాత్రకైనా తాను సిద్ధమే అంటోంది. అలాగే 'ఉంగరాల రాంబాబు' సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తుందట. సునీల్ పక్కన డాన్సులు కూడా ఇరగదేసేసిందట. తెలుగులో ఇదే తొలి సినిమా ఈ ముద్దుగుమ్మకి. కాగా మలయాళంలో చాలా సినిమాలు చేసింది. అలాగే తమిళంలో కూడా నటిగా ప్రూవ్ చేసేసుకుంది. సో యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగానే ఉంది అమ్మడిలో. ఇక తెలుగులో నటిగా ప్రూవ్ చేసుకోవడమే. తెలుగు భాష అంటే తనకెంతో ఇష్టమంటోంది. ఆ ఇష్టంతోనే తెలుగు నేర్చుకొని, టాలీవుడ్‌లో తన ప్రతిభని నిరూపించుకోవాలనుకుంటోందట ముద్దుగుమ్మ మియా జార్జ్.