ఈ రోజుల్లో ఓ చిన్న సినిమా.. అందులోనూ డివైడ్ టాక్ వచ్చిన సినిమా.. బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకోవడం, సేఫ్ జోన్‌లో పడడం అంత తేలికైన విషయం కాదు. డివైడ్ టాక్ వచ్చిందంటే.. సైడ్ అయిపోవాల్సిందే. కానీ `జాంబి రెడ్డి` మాత్రం షాక్ ఇచ్చింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా యావరేజ్, బిలో యావరేజ్ అన్న టాక్ సంపాదించుకుంది. శుక్రవారం వసూళ్లు ఓమాదిరిగా ఉన్నా, శనివారం బాగా డ్రాప్ అయిపోయేసరికి... బ్రేక ఈవెన్ దరిదాపుల్లోకి కూడా వెళ్లదేమో అనుకున్నారంతా. కానీ... అనూహ్యంగా జాంబీ రెడ్డి నిలదొక్కుకుంది. తొలి 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇక నుంచి వచ్చేవన్నీ లాభాలే. అయితే... ఈ శుక్రవారం `ఉప్పెన` విడుదల అవుతోంది. దాన్ని తట్టుకోవడం జాంబికి సాధ్యం కాకపోవొచ్చు. కాకపోతే.. ఈ సినిమా కొన్న బయ్యర్లకు లాస్ లేదు. నిర్మాత మాత్రం ఫుల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు.
జాంబీ రెడ్డి 5 రోజుల వసూళ్లు ఇవీ..
నైజాం 1.56 cr
సీడెడ్ 0.93 cr
ఉత్తరాంధ్ర 0.55 cr
ఈస్ట్ 0.40 cr
వెస్ట్ 0.32 cr
కృష్ణా 0.41 cr
గుంటూరు 0.43 cr
నెల్లూరు 0.27 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 4.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.16 cr
ఓవర్సీస్ 0.24 cr
టోటల్ వరల్డ్ వైడ్ 5.27 cr (షేర్)నైజాం 1.56 cr