మరో సంచలనాత్మక పాత్రలో నటిస్తున్న బాలయ్య..?

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించిన ఈతరం కథానాయకుడు. ఎటువంటి పాత్రలనైనా సరే చేయడానికి వెనుకాడకుండా ఉండే ఈయన సమాజంలో కొందరు ప్రముఖ పాత్రల్లో సైతం నటించి అందరినీ అలరించాడు.

ఇక మరోమారు అలాంటి ఒక పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు అని సమాచారం. అదే రామానుజాచార్యులు పాత్ర. త్వరలోనే దీని పైన ప్రకటన కూడా చేస్తాను అని ఆయన తెలిపాడు. గుంటూరు లో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆయన ఈవిధంగా స్పందించారు. గతంలో తన తండ్రి ఎన్టీఆర్ గారు రామానుజాచార్యుల పైన చిత్రం తీసేందుకు సన్నాహాలు చేసినప్పటికీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని అందుకే తాను ఈ చిత్రం చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.

ఇక రామానుజాచార్యులు గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన చేసిన ఎన్నో పనులు మనకు ఆదర్శం అని అందుకే ఆయన జీవితం పైన చిత్రం తీయాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పైన పనిచేస్తున్న ఈయన త్వరలోనే ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు అని తెలుస్తుంది.

మొత్తానికి త్వరలోనే బాలయ్య మరో సంచలనాత్మక చిత్రంతో కనువిందు చేయబోతున్నాడన్నమాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS