ప్రముఖ తెలుగు సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబయ్‌లోని నివాసంలో నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. భర్త మరణ వార్త తెలుసుకుని, జయసుధ హుటాహుటిన ముంబయ్‌కి వెళ్లారు. నితిన్ కపూర్ బాలీవుడ్ నటుడు జితేంద్రకు స్వయానా సోదరుడు. నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారాయన. జయసుధ, నితిన్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ చాలా అన్యోన్యమైన జంట. జయసుధ తన రాజకీయ రంగ ప్రవేశంలో భర్త నుంచి అందించిన సపోర్ట్ గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో నితిన్ కపూర్ అందరితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణ వార్త విని టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది. నితిన్‌కపూర్ ఆత్మహత్య చేసుకునేంత కఠిన పరిస్థితులు ఏమిటనేవి తెలియరావడంలేదు. జయసుధ, నితిన్‌కపూర్‌ల తనయుడు ఇటీవల ఓ సినిమాతో హీరోగా తెరంటేట్రం చేశాడు.