పవన్ కళ్యాణ్ కి అన్నయ్యే అడ్డంకి..

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించగలడా లేదా అనే అంశం పైన ఒక్కొక్కరు ఒక్కోరకంగా వ్యాఖ్యానం చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఆ జాబితాలోకి ప్రముఖ రాజకీయ నాయకుడు జేసి దివాకర్ రెడ్డి చేరారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సమయంలో, పవన్ కళ్యాణ్ జనసేన గురించి ప్రస్తావన రాగా- “పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి ఆయన అన్న చిరంజీవినే పెద్ద అడ్డంకి” అన్న వ్యాఖ్య చేశాడు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలపడం పెద్ద తప్పు అని, ఇప్పుడు అలాంటి నేపధ్యమే పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టె అంశం అని చెప్పుకొచ్చాడు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా కనపడకపోవచ్చు అని చెప్పాడు. మొత్తానికి ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS