'ఖైదీ' పబ్లిక్‌ షోకి రంగం సిద్ధం

మరిన్ని వార్తలు

చాలా కాలంగా చిరంజీవి సినిమా ఫంక్షన్‌ జరగబోతోంది. అందుకు గుంటూరు పట్టణం వేదిక కానుంది. చిరంజీవి రీ ఎంట్రీలో రాబోతున్న సినిమా 'ఖైదీ నెంబర 150' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అయితే మెదట్లో అనుకున్న డేట్‌ కాకుండా జనవరి 7న ఈ ఫంక్షన్‌ని నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. కానీ అక్కడ ప్లేస్‌ సెట్‌ కాలేదు. సో గుంటూరులోని హాయ్‌లాండ్‌లో ఈ వేడుక జరగనుంది. గతంలో 'ఘరానా మొగుడు' సినిమా ఫంక్షన్‌ని గుంటూరులో జరిపారు. అది అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత విజయవాడలో మరో సినిమా 'ఇంద్ర' ఫంక్షన్‌ జరిగింది. ఈ ఫంక్షన్‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అతి పెద్ద సంచలనం. ఇలా చిరంజీవికి గుంటూరు, విజయవాడలో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా ఫంక్షన్‌ ఆ రికార్డులన్నీ బద్దలుకొట్టేలా ఉండబోతోందని అంచనాలు వేస్తున్నారు. అందులోనూ ఈ వేడుకకి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా రావడం మరో ఎత్తు. దాంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయ్‌. వినాయక్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇంతవరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టేలానే ఉంది. ఇప్పటికే ఆడియో యూ ట్యూబ్‌లో అంచనాలను మించిన స్థాయిలో రికార్డుల గంట మోగించేస్తోంది. ఇక సినిమాపై ఉన్న భారీ అంచనాలకి బాక్సాఫీస్‌ వద్ద ఇంకెన్ని సంచనలనాలకు వేదిక కానుందో చూడాలంటే మరొ కొద్ది రోజులు మాత్రమే వేచి చూడాలి. ఎందుకంటే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కదా! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS