ADA

సల్మాన్‌ఖాన్‌ సరసన నితిన్‌ హీరోయిన్‌

By iQlik Movies - January 10, 2017 - 02:57 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'ట్యూబ్‌ లైట్‌' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవల 'సుల్తాన్‌' సినిమాతో సల్మాన్‌ భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాపై అంతకుమించిన అంచనాలున్నాయి. ఈ సినిమాలో చైనా భామ జూజూ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్‌ ఈ సినిమాకి ఎంపికయ్యింది. ఆమె ఎవరో కాదు తెలుగులో నితిన్‌ సరసన 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలో నటించింది. ఆ ముద్దుగుమ్మే ఇషా తల్వార్‌. తెలుగులో ఈ సినిమాలో నటించిన తర్వాత మలయాళ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది. గతంలో హిందీలోనే ఓ చిత్రంలో నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా తెరకెక్కిన 'ఛప్‌' సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా శోభితా ధూళిపాల నటించగా, సెకండ్‌ హీరోయిన్‌గా ఇషా తల్వార్‌ నటించింది. సల్మాన్‌ సినిమాలో వచ్చిన ఈ తాజా ఆఫర్‌కి అమ్మడు తెగ ఆనంద పడిపోతోందట. ఎందుకంటే సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో ఒక్కసారి నటిస్తే చాలు ఆ హీరోయిన్‌ దశ తిరిగిపోయినట్లే. ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్‌, ఆశిన్‌, ఐశ్వర్యారాయ్‌ కూడా ఈ కోవలో సక్సెస్‌ అయిన భామలే. అలాగే ఈ భామ కూడా ఇక బాలీవుడ్‌లో సత్తా చాటేయడానికి రెడీ అయిపోయినట్లే అనుకుంటున్నారంతా. సల్మాన్‌ఖాన్‌ అంటే ఏదో జస్ట్‌ హీరో కాదు. హీరోయిన్స్‌ పాలిట గాడ్‌ ఫాదర్‌ మరి. దటీజ్‌ సల్మాన్‌ ఖాన్‌. 

 


iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS
Loading...
Loading...

AD

RaaRandoi Veduka Chuddam Telugu Movie

AD

We are Hiring - Content Writer

AD

Ami Thumi Movie Review