పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ మేనియా

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ ఇప్పుడు విడుదల అయి అంతర్జాలంలో సంచలనం సృష్టిస్తున్నది. సరిగ్గా నిన్న సాయంత్రం 7గంటలకి విడుదలైన ఈ టీజర్ YouTubeలో సంచలనంగా మారింది.

ఇప్పటికి ఈ టీజర్ 4 మిలియన్ హిట్స్ వచ్చేసాయి. ఇక కొద్ది గంటల్లోనే ఇది 5 మిలియన్ క్లబ్ లోకి చేరిపోనుంది. ఇక ఇంత చిన్న టీజర్‌లో యాక్షన్‌, రొమాన్స్‌, స్టైల్‌, కటింగ్స్‌, హీరో పవర్‌ అన్నీ చూపించేశాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. పవన్ కళ్యాణ్ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. నార్మల్‌ టీ షర్టుల్లో సూపర్బ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు పవన్‌. 

అలాగే హీరోయిన్లు అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ ఇద్దరికీ టీజర్‌లో చోటుంది. ఇద్దరూ చాలా రొమాంటిక్‌ లుక్స్‌లో కనిపిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ హాట్‌ అప్పీల్‌, కీర్తి సురేష్‌ హోమ్లీ లుక్‌లో అదరగొట్టేస్తున్నారు. అన్నట్లు కీర్తి సురేష్‌కి కూడా కొంచెం మోడ్రన్‌ టచ్‌ ఇచ్చినట్లుగా ఉంది. రెండు యాంగిల్స్‌లో కనిపిస్తోందీ బ్యూటీ.

ఇక లొకేషన్స్‌ చూస్తుంటే, ఓ పక్క హైఫై యూరప్‌ లొకేషన్స్‌, మరో పక్క పచ్చని పంట పొలాలతో కనువిందు చేస్తున్నాయి. యాక్షన్‌ సీన్స్‌ అదరిపోయేలా ఉన్నాయి. అనిరుధ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్తగా ఉంది. చాలా బాగుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS