స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన పవర్ స్టార్

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ మాటకి కట్టుబడే మనిషి అని ఆయన అభిమానులు, సన్నిహితులు పదే పదే చెబుతుంటారు.

అట్లాంటిది తాను పనిచేసిన అజ్ఞాతవాసి టీం కి కొన్ని రూల్స్ పెట్టాడట ఈ పవర్ స్టార్! అవేంటో అని ఆరా తీస్తే- ఈ నెల 19న జరగబోయే ఆడియో విడుదలకి అజ్ఞాతవాసి టీం సభ్యులు తప్ప బయట వేరే అతిధులని పిలవొద్దు అని అదేశించాడట.

దీని వెనుక కారణం ఏంటి అనగా- సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారిని గౌరవించడం ముఖ్యం అని అందుకే బయటి వారిని పిలవడం లేదు అన్నది తెలిసింది. దీనితో అజ్ఞాతవాసి ఆడియో విడుదల కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిధిగా వస్తున్నాడు అన్న వార్తలో నిజం లేదు అని అర్దమైపోయింది. అలాగే ఆడియో వేడుకలో ఫ్యాన్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అని చెప్పాడట.

అయితే ఈ వేడుకకి విక్టరీ వెంకటేష్ మాత్రం హజరుకానున్నాడు అని తెలిసింది. అయితే ఆయన కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర పోషించడం వల్లే ఈ ఆడియో కి వస్తున్నారు అని సమాచారం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS