'అజ్ఞాతవాసి' కాన్సెప్ట్స్‌ సూపర్బ్‌!

మరిన్ని వార్తలు

'అజ్ఞాతవాసి' సినిమా నుండి వచ్చే ప్రతీ స్టిల్‌ విభిన్నంగా ఉంటోంది. ఒక్కో స్టిల్‌ ఒక్కో కాన్సెప్ట్‌ బేస్‌తో విడుదల చేస్తున్నారు. ఇంతవరకూ వచ్చిన స్టిల్స్‌ అన్నీ అలాగే ఉన్నాయి. ప్రీ లుక్‌లో పవన్‌ విండోలోంచి చూస్తున్నట్లుగా ఉన్నాడు. తర్వాత వచ్చిన లుక్‌లో ఐడీకార్ట్‌ చేతిలో తిప్పుతూ, తీక్షణంగా చూస్తున్నట్లున్న స్టిల్‌ అదిరిపోయింది. ఆ తర్వాత సైకిల్‌పై వెళ్లే లుక్‌. నోట్లో బెల్టు పట్టుకుని ఉన్నాడు ఈ స్టిల్‌లో. తాజాగా ఓ లుక్‌ విడుదలైంది. ఆడియో ఫంక్షన్‌ గురించి ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తూ విడుదల చేసిన స్టిల్‌ ఇది. చేతిలో గిటార్‌ పట్టుకుని వున్నాడు.

నిజానికి అక్కడ పవన్‌ చేతిలో గిటార్‌ లేదు.. గ్రాఫిక్స్‌లో క్రియేట్‌ చేసి, స్టైలిష్‌గా డిజైన్‌ చేశారు. ఈ స్టిల్‌ ఇప్పుడు ట్రెండీ అయ్యింది. ఇలా ఈ సినిమా నుండి వస్తున్న ప్రతీ స్టిల్‌నీ డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో డిజైన్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు. అన్నింటి కంటే ముందొచ్చిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ అయితే సూపర్బ్‌ అని చెప్పాలి. ఈ మధ్యనే రెండు ఆడియో సింగిల్స్‌ బయటికి వచ్చాయి. దుమ్ము దులిపేస్తున్నాయి. యూత్‌లో ట్రెండీ అయిపోయాయి ఆ సాంగ్స్‌. అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారట.ఈ నెల 19న ఆడియో ఫంక్షన్‌ జరగనుంది.

ఈ ఆడియో వేడుకకు మొదట్లో చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్న కారణంగా, ఈ ఆడియో ఫంక్షన్‌కి రాలేకపోవచ్చనీ సమాచారమ్‌. అయితే ఎన్టీఆర్‌ ఈ ఫంక్షన్‌కి గెస్ట్‌గా విచ్చేయనున్నాడనీ తాజాగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ సినిమాకి కూడా అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోనే ఈ సినిమా తెరకెక్కునుంది. కాబట్టి ఈ ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువనే చెప్పొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS