ఖైదీ నెంబర్ 150 సినిమాని జనవరి 11న విడుదల చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ముందుగా ఈ సినిమాని 13 లేదా 14న విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు డేట్ 11వ తేదీకి ఫిక్స్ అయ్యింది. నిర్మాత రామ్‌చరణ్ ఈ సినిమా విడుదల డేట్‌ని ఖరారు చేశాడు. చిరంజీవి సూచన మేరకే ఈ డేట్ మార్పు జరిగిందని సమాచారమ్. తొలి రోజు రికార్డుల్ని కొల్లగొట్టాలంటే అప్పటికి మార్కెట్లో ఇంకో పెద్ద సినిమా ఏదీ ఉండకూడదు. అలా ఆలోచించి 11వ తేదీని లాక్ చేశారట. తద్వారా మేగ్జిమమ్ థియేటర్స్‌లో ఖైదీని విడుదల చేయాలని సంకల్పించినట్లున్నారు. ప్రీ రిలీజ్ బజ్ చాలా బాగుండడం, 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఓపెనింగ్స్ సహజంగానే అదిరిపోతాయి. అలా ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. దాంతో పాటుగా లాంగ్ వీకెండ్ 'ఖైదీ'కి చాలా పెద్ద ప్లస్ కానుందని సమాచారమ్. అంతే మరి మెగాస్టార్నా మజాకానా! ఇవన్నీ ఒక ఎత్తు. ఇక సినిమా విషయానికి వస్తే పాటల్లో ఉన్న మాస్ అప్పీల్ చూస్తుంటేనే తెలిసిపోతోంది . ఓన్లీ ఆడియో సింగిల్స్‌తోనే రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు మెగాస్టార్. ఆడియో సింగిల్స్ క్లిప్పింగ్స్తోనే దున్నేస్తున్నాడు. ఇప్పుడందరి దృష్టి చిరంజీవి సినిమా పైనే ఉంది. అంతకన్నా ముందు జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఆశక్తిని రేకెత్తిస్తోంది. దటీజ్ మెగాస్టార్ మరి.