'పద్మావత్‌' వారందరి 'బలి' కోరుతుందా?

మరిన్ని వార్తలు

సుప్రీంకోర్టు ఆదేశించినా 'పద్మావత్‌' విడుదల కష్టాలు తీరట్లేదు. కొత్తగా మరో సమస్య వచ్చి పడింది ఈ సినిమా విడుదలకు. ఈ సినిమా విడుదలని బ్యాన్‌ చేయాలంటూ గత కొంత కాలంగా రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆందోళనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆందోళనలకు మహిళలు కూడా రంగంలోకి దిగడంతో వివాదం తీవ్రతరమైంది. 

రాజస్థాన్‌లో 2000 మంది మహిళలు ఈ సినిమాని ధియేటర్‌లో ప్రదర్శిస్తే ఆత్మాహుతికి పాల్పడతామని రిజిస్టర్‌ చేస్తూ, సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దాంతో ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఆల్రెడీ ఈ సినిమాని బ్యాన్‌ చేసిన ఆరు రాష్ట్రాల్లో కూడా సినిమా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రశాంత వాతావరణంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రా ప్రభుత్వాలకు సూచిస్తూ, ఈ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ చేసింది సుప్రీంకోర్డు. 

అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు తాజాగా పిటీషన్‌ని దాఖలు చేశారు. సుప్రీంకోర్డు ఆదేశం తర్వాత కూడా 'పద్మావత్‌' సినిమాపై ఆందోళనలు వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తే ధియేటర్స్‌ని తగులబెట్టేస్తామంటూ ధియేటర్‌ యజమానులను ఆందోళనకారులు హెచ్చరించారు. 

అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఏమో ఏం జరుగుతుందో చూడాలి మరి. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS