మాస్‌ అండ్‌ క్లాస్‌ 'కాటమరాయుడు'

By iQlik Movies - January 14, 2017 - 06:13 AM IST

మరిన్ని వార్తలు

పవన్‌కళ్యాణ్‌ 'కాటమరాయుడు' సినిమాలో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే పవన్‌కళ్యాణ్‌ క్లాస్‌ మెచ్చిన హీరో కూడా. అందుకే మాస్‌ లుక్‌ అయినా చాల క్లాస్‌గా కనిపిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన లుక్‌ చాలా బాగుందనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన 'వీరం' సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తమిళంలో అజిత్‌ ఈ సినిమా చేశాడు. తమన్నా అందులో హీరోయిన్‌. తెలుగులో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.స్టయిలిష్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా 'వీరం' ఘనవిజయాన్ని అందుకుంది. దాన్ని మించేలా 'కాటమరాయుడు' ఉంటుందట. 'గోపాల గోపాల' తర్వాత దర్శకుడు డాలి, పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్న చిత్రమిది. ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడంతో ఈ సినిమాలో పొలిటికల్‌ టచ్‌ కూడా ఉండబోతుందనే ప్రచారం నడుస్తోంది. శృతిహాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో అది కుదరకపోవడంతో, టీజర్‌ విడుదలను వాయిదా వేశారు. జనవరి 26న 'కాటమరాయుడు' టీజర్‌ రానుంది. ఈ ఏడాది రానున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో 'కాటమరాయుడు' ఒకటి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now