లైవ్ షో లో రెచ్చిపోయి తిట్టుకున్న రోజా - బండ్ల గణేష్

మరిన్ని వార్తలు

టీవీ ఛానల్స్ లో ఈ మధ్యకాలంలో వస్తున్న డిబేట్లు చూడాలంటేనే భయం వేస్తున్న రోజులివి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికి వచ్చిన టాపిక్ ని పక్కన పెట్టి ఒకరిపైన ఒకరు దూషనలకి దిగడం చూస్తుంటే సగటు ప్రేక్షకుడు విస్మయానికి గురవ్వక తప్పని పరిస్థితి.

ఇందుకు తాజా ఉదాహరణే నిన్న రాత్రి ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో జరిగిన డిబేట్ లో నటి-రాజకీయ నాయకురాలు-ఎమ్యెల్యే అయిన రోజా అలాగే నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ మధ్యలో జరిగిన సంబాషణ ఎంత దారుణంగా ఉందొ చెప్పలేం.

రాయడానికి వీలు కూడా లేని పదాలతో వారు మాట్లడుకోవడంతో ఆ డిబేట్ లో ఉన్న వారు, ఆ షో వీక్షిస్తున్న ప్రేక్షకులు విస్తుపోయారు. అసలు టాపిక్ పవన్ కళ్యాణ్ గురించి అయితే వారు మాట్లాడుకున్న మాటలు అసలు దానికి సంబంధం లేకుండా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

ఈ డిబేట్ చూసిన వారు అందరు వీరి ఇద్దరి ప్రవర్తనని తప్పుబడుతున్నారు. మరి ఇప్పటికైనా వీరివురు తమ పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS