షాకింగ్: సాయి పల్లవి నటనకి గుడ్ బై చెప్పనుందా?

మరిన్ని వార్తలు

సాయి పల్లవి- ఇప్పుడు ఈ నటికి ఫిదా అవ్వని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

అట్లాంటి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఒక షాకింగ్ వార్త బయటపెట్టింది. అందరు మనకి జూనియర్ సావిత్రి దొరికేసింది అనుకుంటున్న తరుణంలో- నేను ఎన్ని రోజులు సినిమాల్లో నటిస్తానో నాకే తెలియదు. బహుశా ఎక్కువ రోజుల మాత్రం చేయను అంటూ చెప్పి అందరికి ఒక ఝలక్ ఇచ్చింది.

దీనికి కారణం ఏంటంటే- ఇప్పుడు ఆమె కేరళలో MBBS ఆఖరి సంవత్సరం చదువుతున్నది. ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా సెలవురోజుల్లో చేసినవే! తనకి ఎప్పటికైనా డాక్టర్ గానే స్థిరపడాలని ఉన్నట్టు అందుకే తన సినిమా కెరీర్ కి ఏరోజైన ఫుల్ స్టాప్ పడొచ్చు అని చెప్పింది.

ఇది ఒకరకంగా మలర్-భానుమతి ఫ్యాన్స్ కి చేదు వార్త అనే చెప్పాలి.
   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS